జేజేలు
కొట్టండి చప్పట్లు అందరూ
పలకండి జేజేలు అందరూ
పుట్టిన రోజు తాతాయిది
వేయి పున్నములు చూసిన బుజ్జాయిది
పుత్ర పౌత్ర ప్రపౌత్రాభివృద్ధిగా
దీవించి దేవతలు - అలనాడు
కామేశ్వరమ్మ ఒడి నుంచిన పాపాయిది
బ్రహ్మోప దేశమూ, తారక మంత్రోపదేశమూ
తండ్రి నుంచి అందుకున్న 'అబ్బాయిది '
త్రిభాషా ప్రవీణుడిది
ఉపన్యాస ధురీణుడిది
అసంఖ్యాక శిష్య గణము చేత
' భళీ ' అనిపించుకున్న మాష్టారిది
ఛందోబద్ధ కావ్యరచన
అలవోకగా సాగించిన కవి శేఖరునిది
విద్వత్సభల నీరాజనమందిన విద్వన్మణిది
' భళ్ళముడి ' వంశ శిరోమణిది
సంగీత , సాహిత్య రసాస్వాదనాసక్తుడొకనాడు
నిరంతర భగవన్నామ స్మరణానురక్తుడీనాడు
పేరు సీతారామమూర్తి అయినా
నుదుట విభూతి రేఖలతో, పక్కన
' అమ్మలగన్న అమ్మ ' సూరీడమ్మతో
ఆయన పరమేశ్వర మూర్తి
మన ముందు తరాలకూ
ఆయన జీవితమొక స్ఫూర్తి.
విజయ
17/09/2002
No comments:
Post a Comment