అమ్మమ్మ
అందగత్తె కాదు మా అమ్మమ్మ
'గానకోకిల' కాదు మా అమ్మమ్మ
విద్వాంసురాలు కాదు మా అమ్మమ్మ
విదుషీమణి కాదు మా అమ్మమ్మ
ఉద్యోగం చెయ్యలేదు అమ్మమ్మ
ఊళ్ళేమీ ఏలలేదు అమ్మమ్మ
సంఘసేవ చెయ్యలేదు అమ్మమ్మ
సన్మానాలు పొందలేదు అమ్మమ్మ
అయినా
అన్నపూర్ణ మా అమ్మమ్మ
'అమృతహస్త' మా అమ్మమ్మ
ప్రేమగల అమ్మ మా అమ్మమ్మ
ఓర్పుగల అత్త మా అమ్మమ్మ
చల్లనితల్లి మా అమ్మమ్మ
బంగారుకొండ మా అమ్మమ్మ
పండుముత్తైదువ మా అమ్మమ్మ
పార్వతీదేవి మా అమ్మమ్మ
ముద్దెంతో చేసేది అమ్మమ్మ
తనే ముద్దొస్తోంది అమ్మమ్మ
విజయ
19/09/2001
No comments:
Post a Comment